బహ్రెయిన్ ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ కార్యకలాపాలు పునఃప్రారంభం
- August 14, 2019
బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కంపెనీ, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయినట్లు వెల్లడించింది. ఓ విమానం నుంచి ఆయిల్ లీక్ కావడంతో, సుమారు గంటపాటు రన్ వేని మూసివేశారు సాయంత్రం 4.27 నిమిషాల సమయంలో. ప్రయాణీకుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, ఐదు విమానాల్ని దమ్మామ్ ఎయిర్పోర్ట్ వైపుకు మళ్ళించామనీ, మరొకటి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి మళ్ళించడం జరిగిందని బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కంపెనీ పేర్కొంది. పూర్తిగా ఆయిల్‌ని రన్ వే నుంచి తొలగించిన తర్వాత యధాతథంగా ఎయిర్ పోర్ట్‌లో ల్యాండింగ్, టేకాఫ్ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు తెలిపారు అధికారులు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







