రిటైర్డ్‌ సీనియర్‌ అధికారిని అవమానించిన కేసులో ఇండియన్‌ అరెస్ట్‌

రిటైర్డ్‌ సీనియర్‌ అధికారిని అవమానించిన కేసులో ఇండియన్‌ అరెస్ట్‌

కువైట్‌: రిటైర్డ్‌ సీనియర్‌ అధికారి ఒకరు తనను ఇండియన్‌ వ్యక్తి ఒకరు అవమానించారంటూ పోలీసులకు పిర్యాదు చేయడం జరిగింది. కారులో వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందనీ, వెంటనే సదరు రిటైర్డ్‌ సీనియర్‌ అధికారి ఆపరేషన్‌ రూమ్‌కి సమాచారం అందించడం జరిగిందనీ అధికారులు తెలిపారు. నిందితుడి కారు నెంబర్‌ని ఆపరేషన్‌ రూమ్‌కి బాధిత అధికారి తెలియజేయడంతో, ఆ నెంబర్‌ ప్లేట్‌ని ఆధారంగా చేసుకుని నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. కేసు విచారణ కొనసాగుతోంది.  

--షేక్ బాషా(కువైట్)

Back to Top