సౌదీ జైలులో హక్కుల కార్యకర్తలకు చిత్ర హింసలు
- August 16, 2019రియాద్: సౌదీ అరేబియా లోని జైలుల్లో మగ్గుతున్న హక్కుల కార్యకర్తలు చిత్ర హింసలు ఎదుర్కొంటున్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ మహిళా హక్కుల ఉద్యమ కార్యకర్త లౌజాన్ అల్ హత్లౌల్ ఈ మేరకు ఒక వీడియో విడుదల చేశారు. ఆమె కూడా జైలులో చిత్ర హింసలకు గురయ్యారు. ఎవ్వరైనా విడుదల కోసం అభ్యర్థిస్తే తమపై ఎటువంటి చిత్రహింసలు, లేదా దాడి జరగలేదని వాగ్మూలమివ్వాలంటూ అధికారులు షరతులు పెడుతున్నారని లౌజాన్ తెలిపారు. జైలులో తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా ఎటువంటి చిత్రహింసలు జరగలేదని వాగ్మూలమిస్తేనే బెయిల్ ఇస్తామని తమపై ఒత్తిడి చేసినట్లు ఆమె పేర్కొన్నారు. అయితే ఈ షరతుల ఒప్పందాన్ని తాను తిరస్కరించానన్నారు. లౌజాన్ వీడియో ఇప్పుడు సౌదీలో భారీ నిరసన ప్రదర్శనలకు దారితీస్తోంది. మహిళా హక్కుల కోసం ఉద్యమిస్తున్న హత్లౌల్ తదితర కార్యకర్తలను, ఆమె కుటుంబ సభ్యులను 2018 మే నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?