సలాలాలో అగ్ని కీలల్ని అదుపు చేసిన ఫైర్ ఫైటర్స్
- August 16, 2019
మస్కట్: సలాలా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ కార్ వాష్ స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దోఫార్ గవర్నరేట్‌లో జరిగిన అగ్ని ప్రమాదం గురించిన సమాచారం అందుకోగానే, ఫైర్ ఫైటర్స్ రికార్డు సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) పేర్కొంది. ఫైర్ ఫైటర్స్ చాకచక్యంగా వ్యవహరించి మంటల్ని అదుపు చేశారనీ, ఈ క్రమంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా వుండాలనీ, తగిన ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఆయా సంస్థల నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు పిఎసిడిఎ అధికారులు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







