ఎయిర్ఏషియా విమానంలో బాయ్‌ఫ్రెండ్ పక్కన సీటు అడిగితే ఇవ్వలేదని…
- August 17, 2019
విమాన ప్రయాణం ఓ లగ్జరీ జర్నీ. బ్యాగ్ చెకింగ్ నుంచి మెుదలుకొని విమానంలో కూర్చునే వరకు ప్రతిదీ పద్ధతిగా జరుగుతాయి. మన గమ్యం చేరుకునే వరకు ఎయిర్ హోస్టెస్ చేసే సకల మర్యాదలూ వారి పలకరింపులు మనం ఎవరి దగ్గరా చూసి ఉండమేమో. ప్రయాణికులను వారు చంటి బిడ్డలా చూసుకుంటారు. ప్రతి ప్రయాణికుడిని నవ్వుతూ పలకరిస్తూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహనాన్ని కోల్పోకుండా ఉంటారు. కానీ కొందరు వారి సహనాన్ని అలుసుగా తీసుకుంటారు. వారిపై దుర్భాషలు ఆడడం చేయి చేసుకోవడం చేస్తుంటారు. తాజాగా ఓ విమాన ప్రయాణికురాలు గగన సఖిని ఘోరంగా అవమానించింది.
ఓ ఎయిర్ఏషియా ప్లైట్‌లో ట్రావెల్ చేస్తున్న ఓ మహిళ తన బాయ్‌ఫ్రెండ్ పక్కన సీటు అడిగితే ఇవ్వలేదని ఎయిర్ హోస్టెస్‌పై అమానవీయంగా ప్రవర్తించింది. ఆమె ముఖంపై నూడిల్స్‌లోని వేడి నీరు విసిరికొట్టింది. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చైనాకు చెందిన ఓ యువతి, తన బాయ్‌ఫ్రెండ్‌తో ఎయిర్ఏషియా విమానంలో టికెట్ బుక్ చేసుకుంది. అయితే వారికి పక్కపక్క సీట్లు రాలేదు. దీంతో తన బాయ్‌ఫ్రెండ్ పక్కన సీట్లో కూర్చోబెట్టాలని నురాలియా మజ్లాన్ అనే ఎయిర్ హోస్టెస్‌ను కోరింది. సీట్ల మార్పునకు ఎవరూ ఒప్పుకోకపోవడంతో సర్దుబాటు చేయలేకపోతున్నానని ఎయిర్‌హోస్టెస్ ప్రయాణికురాలికి తెలిపింది. ఆ సమాధానంతో రగిలిపోయిన ఆ చైనీస్ యువతి తన చేతిలో ఉన్న నూడిల్స్ కప్పులోని వేడి నీటిని ఎయిర్‌హోస్టెస్ ముఖంపై విసిరిగొట్టింది. దీంతో ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినిపించుకోలేదు. ఆమెకు బాయ్‌ఫ్రెండ్ కూడా తోడైయ్యాడు. విమానాన్ని పేల్చేస్తానంటూ సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడ్డాడు.
చివరకు ఇతర ప్రయాణికులు కూడా కలగజేసుకుని వారికి సర్ధిచేప్పడంతో గొడవ ఆపారు. విమానం గమ్యస్థానానికి చేరగానే ఎయిర్‌పోర్టు భద్రతాసిబ్బందికి ఎయిర్ హోస్టె ఫిర్యాదు చేసింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ఏషియా సంస్ధ కూడా వారిపై కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ విమానాలలో ఎప్పుడూ ప్రయాణించకుండా ఆమెపై నిషేధం విధించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







