లిథువేనియా మాకు మిత్ర దేశమే--ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

- August 20, 2019 , by Maagulf
లిథువేనియా మాకు మిత్ర దేశమే--ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

విల్నీయస్: లిథువేనియా-భారత్ మధ్య బలమైన సాంకేతిక భాగస్వామం ఉందని, తమకు నిజమైన మిత్ర దేశమని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆగ్రో రంగంలోనూ పరస్పరం సహకరించుకుంటున్నాయని సోమవారం ఇక్కడ తెలిపారు. లిథువేనియా, లాత్వియా, ఎస్టోనియాలో ఐదు రోజుల పర్యటన నిమిత్తం భారత ఉప రాష్ట్రపతి శనివారం ఇక్కడకు వచ్చారు. బాల్టిక్ దేశాల్లో భారత ఉన్నత స్థాయి బృందం పర్యటించడం ఇదే మొదటిసారి. భారత-లిథువేనియా వ్యాపారుల ఫోరంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టం కావాలని ఆకాంక్షించారు. 'లిథునేమియా మాకు అత్యంత కీలకమైన భాగస్వామి. యూరప్‌లోని బాల్టిక్ దేశంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమ న్యాయం విరాజిల్లుతోంది. మాకు నిజమైన మిత్రదేశం' అని ఆయన స్పష్టం చేశారు. 'రెండు దేశాల్లోనూ స్వేచ్ఛాయుత వ్యాపార వాణిజ్యం సాగుతోంది'అని భారత ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక వ్యాపారవేత్తల ఫోరం ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. లిథునేనియా- భారత్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు పటిష్టానికి ఫోరం కృషి చేస్తుందన్న ఆశాభావం ఉప రాష్టప్రతి వ్యక్తం చేశారు. 'భారత్ కంపెనీలు ఫోరంలో భాగస్వాములు కావడడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది'అని అన్నారు. ప్రపంచ మార్కెట్‌లో దూసుకుపోతున్న భారత్ సేవలు లిథునేనియా ఉపయోగించుకోవాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. అలాగే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com