ఇండోనేషియాలో ఉద్రిక్తత..పార్లమెంట్ భవనానికి నిప్పంటించిన విద్యార్థులు
- August 20, 2019
జకార్తా : విద్యార్థి సంఘాల నేతలపై పోలీసులు లాఠీలు ఝుళిపించినందుకు నిరసనగా ఇండోనేషియాలో నిరసనలు వెల్లువెత్తాయి. పోలీసుల చర్యలను నిరసిస్తూ విద్యార్థులు కదం తొక్కారు. నిరసనకారులు పవువా ప్రావిన్స్ రాజధాని మనోక్వరి వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పార్లమెంట్ భవనానికి నిప్పంటించారు.
వాణిజ్య సముదాయాలపై దాడులకు పాల్పడ్డారని ప్రభుత్వ అధికార ప్రతినిధి దేది ప్రసేత్యో తెలిపారు. నిరసన కార్యక్రమాలకు వెస్ట్ పపువా నేషనల్ కమిటీ నేతృత్వం వహించింది. పలువురు విద్యార్థులను పోలీసులు అక్రమంగా నిర్బంధించిన కారణంగా ఘర్షణ వాతావరణ నెలకొందన్నారు. అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. కాగా, పపువా పశ్చిమ ప్రాంతంలోని సురబయా, మలాంగ్ నగరాల్లోని విద్యార్థులను గతవారం పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. విద్యార్థులు జాతీయ పతాకాన్ని అగౌరవపరిచారని, అవమానపరిచారంటూ కేసులు పెట్టారు. అయితే, పోలీసుల ఆరోపణలను విద్యార్థులు ఖండించారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







