యాహూలో ఉద్యోగులపై వేటు పడనుంది
- January 08, 2016
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ యాహూలో ఉద్యోగులపై వేటు పడనుంది. సంస్థ నుంచి 10 శాతం కన్నా ఎక్కువ మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించే ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం. దీంతో వెయ్యిమందికి పైగా సిబ్బంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. ఇటీవల యాహూ వాటాదారుల నుంచి ఎదురైన ఒత్తిళ్ల వల్లే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సంస్థలోని అన్ని విభాగాలపై ఈ ప్రభావం పడనుంది. ముఖ్యంగా మీడియా బిజినెస్, యూరోపియన్ ఆపరేషన్స్ ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తున్నారు. జనవరి చివరి నుంచే తొలగింపుల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సమాచారం. యాహూ సీఈవో మరిస్సా మేయర్, ఆమె బృందాన్ని కూడా పదవుల నుంచి తప్పించాలని యాహూ వాటాదారైన స్టార్‌బోర్డ్ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌కు లేఖ రాసింది. అయితే యాహూ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







