బహ్రెయిన్‌తో భారత్ బంధం మరింత బలోపేతం
- August 23, 2019
బహ్రెయిన్:భారత ప్రధాని నరేంద్ర మోడీ బహ్రెయిన్‌లో పర్యటించనున్న విషయం విదితమే. జీ7 సమ్మిట్‌లో పాల్గొనే క్రమంలో బహ్రెయిన్‌తోపాటు యూఏఈలో కూడా ఆయన పర్యటిస్తారు. కాగా, బహ్రెయిన్‌తో భారత బంధం మరింత బలోపేతం దిశగా తన పర్యటన బహ్రెయిన్‌లో వుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. బహ్రెయిన్ - భారత్ మధ్య ఎన్నో ఏళ్ళుగా సన్నిహిత సంబంధాలున్నాయనీ, తన పర్యటనతో ఆ సంబంధాలు మరింత మెరుగవుతాయని ఆశిస్తున్నట్లు మోడీ చెప్పగా, భారత్‌తో స్నేహ సంబంధాలు పెంచుకోవడానికి బహ్రెయిన్ ఎప్పుడూ సిద్ధంగా వుంటుందని బహ్రెయిన్ వర్గాలు వెల్లడించాయి. భారత్ - బహ్రెయిన్ మధ్య 2018-19 కాలంలో 1.3 బిలియన్ అమెరికన్ డాలర్ల బై లేటరల్ ట్రేడ్ జరిగిందని సంంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







