ఇండియన్ టూరిస్టుల సంఖ్య 50 శాతం పెరుగుదలపై బహ్రెయిన్ ఫోకస్
- August 24, 2019
ఇండియన్స్‌కి టాప్ వెడ్డింగ్ స్పాట్‌గా బహ్రెయిన్ మారుతోంది. ఈ విభాగంలో 50 శాతం వృద్ధిని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీకి చెందిన కంట్రీ మేనేజర్ సునీల్ మాతాపతి చెప్పారు. వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన రోడ్ షో సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారాయన. 2018లో 43 శాం వృద్ధిని ఇండియన్ టూరిస్టుల విభాగంలో సాధించామనీ, ఈ ఏడాది చివరి నాటికి ఇది 50 నుంచి 56 శాతం వరకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు మొత్తం 18 ఇండియన్ వెడ్డింగ్స్ బహ్రెయిన్‌లో జరిగినట్లు వివరించారు మహాపతి. బహ్రెయిన్ ఫోర్ట్, అల్ ఫతెహ్ గ్రాండ్ మాస్క్, రిఫ్ఫా ఫోర్ట్, ముహర్రాక్ ఓల్డ్ హౌసెస్, గ్రావిటీ స్కై డైవింగ్ మరియు బోల్డన్ని వాటర్ స్పోర్ట్స్ బహ్రెయిన్ టూరిజంలో ప్రధాన ఆకర్షణలుగా వున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







