‘ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపే చూస్తోంది’:ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- August 28, 2019
విశాఖ:చంద్రయాన్-2 ద్వారా భారత్ మరో చరిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసుకోబోతోందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ‘గోల్డెన్ జర్నీ’ పేరిట రూపొందించిన ఫొటో ఆల్బమ్‌ను ఆయన విశాఖలో విడుదల చేశారు. ఎన్‌ఎస్‌టీఎల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఎనిమిది మంది శాస్త్రవేత్తలకు అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘‘శాస్త్రవేత్తలందరికీ నా అభినందనలు. న్యూక్లియర్ సబ్ మెరైన్ వృద్ధి చేసుకున్న కొద్ది దేశాల్లో మనం ఉండటం అద్వితీయం. ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపే చూస్తోంది. మనం ఎవరి వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోం. మన వ్యవహారాల్లోకి వస్తే ఎప్పుడూ చూడని సమాధానం ఇచ్చాం. పొరుగు దేశం ప్రోద్బలం వల్ల వచ్చే ఇబ్బందులను సమర్థంగా తిప్పికొట్టగలం. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమనడానికే ఆర్టికల్ 370 రద్దు జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అంతర్జాతీయ వేదికలపై ఇదే అంశాన్ని స్పష్టంచేస్తున్నారు. దేశమంతా ఒకే స్వరంతో చాటిచెప్పాలి’’ అని అన్నారు.

తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







