కశ్మీర్ అభివృద్ధిపై ప్రత్యేక బృందం ఏర్పాటు...ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు
- August 28, 2019
దిల్లీ: కశ్మీర్ అభివృద్ధిపై మంత్రులతో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, థావర్‌సింగ్ గహ్లోత్, జితేందర్ సింగ్, నరేంద్ర సింగ్ తోమర్, ధర్మేంద్ర ప్రధాన్ ఈ బృందంలో ఉన్నారు. కశ్మీర్ అభివృద్ధిపై మంత్రుల బృందం బ్లూప్రింట్‌తో రావాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కశ్మీర్ అభివృద్ధిపై వివిధ మంత్రిత్వ శాఖల పనితీరు, ఏ మంత్రిత్వ శాఖ ఎలా పనిచేస్తుందో అనే వివరాలతో కూడిన బ్లూప్రింట్‌తో రావాలని బృందానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 31లోపు సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్రం పేర్కొంది. మంత్రుల బృందం సమర్పించే నివేదిక ఆధారంగా ప్రధాని కశ్మీర్‌కు మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యువత నైపుణ్యాభివృద్ధిపై ఇప్పటికే మంత్రుల బృందం రెండుసార్లు భేటీ అయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







