ఇంటి పేరుతో పేరు ప్రఖ్యాతులు రావు:మోదీ
- August 30, 2019
ఢిల్లీ:ఇంటి పేరుతో పేరు ప్రఖ్యాతులు రావని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పెద్ద కుటుంబం నుంచి వచ్చామా, పెద్ద నగరాలు, పెద్ద విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నామా అనేదానిని బట్టి విజయం సిద్ధించదన్నారు. వ్యక్తిగత సామర్థ్యం, సాధించాలనే సంకల్పం, కష్టపడే తత్వంతోనే అన్ని సాధ్యమవుతాయన్నారు. కోచీలోని మలయాళ మనోరమ మీడియా కాన్‌క్లేవ్‌ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ప్రజా జీవితం లో వ్యక్తులు, సంస్థల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకో వాలని సూచించారు. ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ చర్చలకు అవకాశం ఉండాలన్నారు. కొంతమంది గొంతుక మాత్రమే వినిపించడం మంచి పద్ధతి కాదన్న మోదీ, ప్రతి భారతీయుడి అభిప్రాయాలను వినాలని సూచించారు.
దేశంలో భారీ సంఖ్యలో ఆయుష్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా 12 వేల 500 ఆయుష్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ తెలిపారు. ఈ ఏడాది 4 వేల సెంటర్లు నెలకొల్పుతామన్న ప్రధాని, మొదటి దశలో 10 కేంద్రాలను ప్రారంభించారు. ఒకే దేశం-ఒకే పన్ను తరహాలో ఆయుష్ గ్రిడ్‌ను నెలకొల్పాల్సిన అవసరముందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







