భారత్ కు పొంచివున్న ఉగ్రముప్పు..
- August 31, 2019
జమ్మూకశ్మీర్లో క్రమేనా కొన్ని చోట్ల ఆంక్షలు సడలిస్తున్నా.. మరికొన్ని చోట్ల తిరిగి ఆంక్షలు విధిస్తున్నారు. కశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ప్రజా రవాణా, మార్కెట్లు మూత పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఫోన్ సర్వీసులపై ఆంక్షలు సడలించినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జమ్మూ, శ్రీనగర్, లఢాఖ్‌లలో మాత్రం ఆంక్షలు తొలగించారు.
ఐదు జిల్లాల్లో ఫోన్ సర్వీసులు పునరిద్ధరించటంతో పుకార్లు చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. కశ్మీర్‌లో పరిస్థితులపై పుకార్లు వ్యాప్తి చేసినా, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. కశ్మీ ర్ మీడియా కేంద్రం కూడా, పుకార్లు-వదంతులతో అల్లర్లను ప్రేరేపిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.
కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ లో విధ్వంసానికి పాక్ కుట్రలు చేస్తోంది. దీంతో గుజరాత్ లో హైఅలర్ట్ విధించిన అధికారులు, పర్యాటక, అథ్యాత్మిక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులోభాగంగా ఆథ్యాత్మిక పర్యాటక ప్రాంతం అయోధ్యలో భద్రత పెంచారు. ఉగ్రవాదులు దాడి చేసే ప్రమాద ముందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మూడు జోన్ల నుంచి వందమంది చొప్పున మెరికల్లాంటి పోలీసులను ఎంపిక చేసి అయోధ్యకు భద్రత కల్పించాలని నిర్ణయించింది. పోలీసుల ఎంపికపై బరేలీ, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్ జోన్లకు డీజీపీ నుంచి ఆదేశాలు వెళ్లాయి.
అయోధ్య వివాదంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దీనికి తోడు ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో పాకిస్తానీ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉంది. లష్కరే తోయిబా టెర్రరిస్టులు వారణాసిలో పర్యటించారని నిఘా సంస్థలు పేర్కొన్నాయి. కాశీ కేంద్రంగా మారణహోమం సృష్టించడానికి ప్రణాళిక రచించారని వార్నింగ్ ఇచ్చాయి. కాశీలో రహస్యంగా ఉగ్రవాద శిబిరాన్ని ఏర్పాటు చేసే ప్లాన్‌లో టెర్రరిస్టులు ఉన్నారని నిఘా బృందాలు తెలిపాయి. భారీ దాడులతో దేశంలో విధ్వంసం సృష్టించడానికి ఉగ్ర మూకలు పొంచి ఉన్నాయని వివరించాయి. ఈ హెచ్చరికలతో ఉత్తరప్రదేశ్ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా సోదాలు, తనిఖీలు ముమ్మరం చేసింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!