చిన్ననాటి కల ఇప్పుడు సాకారమైంది:ఉప రాష్ట్రపతి
- September 02, 2019
భారత దేశంలో మౌలిక సదుపాయల రూపకల్పన వేగంగా జరుగుతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఏ ప్రభుత్వమైనా ఢిల్లీ నుంచి వచ్చిన నిధులను గల్లీదాకా చేరెలా చేయడంతో పాటు అవినీతికి తావులేకుండా చూడాలని కోరారు. గూడూరు-విజయవాడ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య, కేంద్రమంత్రులు సురేష్ అంగడి, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో పూర్తిస్థాయిలో విద్యుదీకరించిన వెంకటాచలం- ఓబులవారిపల్లి రైలు సొరంగ మార్గాన్ని జాతికి అంకితం చేశారు. ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌తో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల అవసరాలు తీరుతాయన్న వెంకయ్య.. మరోవైపు.. మారుమూల ప్రాంతాలకు రైలు సౌకర్యం రావడం హర్షణీయం అన్నారు. అలాగే తాను పుట్టి పెరిగిన ఊరికి దగ్గరగా రైల్వే లైను వెళ్లడం చాలా ఆనందంగా ఉన్నారు. తన చిన్ననాటి కల ఇప్పుడు సాకారమైందంటూ సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







