విశాఖపట్నంలో వెలుగుచూసిన మరో ఆన్‌లైన్ దోపిడీ
- September 02, 2019
విశాఖలో ఆన్‌లైన్ చీటింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 7.6 లక్షల నగదుతోపాటు బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నారు. బంగారం లింక్ బిజినెస్ చేసేందుకు విశాఖలో 2 రోజుల కిందట ఓ ముఠా మకాం వేసింది. అనుమానం వచ్చిన విశాఖ పోలీసులు దర్యాప్తు చేసి సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
మెండోలిల్ జ్యువెలరీ లిమిటెడ్ కంపెనీ పేరుతో చైన్ లింక్ బిజినెస్ చేసే గుర్గావ్ ముఠా ఓ హోటల్‌లో మకాం వేసింది. ఆన్‌లైన్ ద్వారా తమ కంపెనీలో సభ్యులుగా చేరేవారికి నగదుతోపాటు బంగారం ఇస్తామని ఆశచూపారు. ముందుగా 11 వేల నగదుతోపాటు జీఎస్టీ కింద 3 వందలు కట్టాలన్నది స్కీమ్. ఆ తర్వాత కంపెనీ నుంచి ప్రతినెలా 550 రూపాయలు, ఒక గోల్డ్ కాయిన్ ఆఫర్ ఇచ్చారు. దీంతో చాలా మంది ఆసక్తిచూపారు. హోటల్‌కు పెద్ద ఎత్తున జనాలు రావడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రెయిడ్ చేసి అందరినీ అదుపులో తీసుకున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







