యూఎస్‌తో మెరుగైన సంబంధాలే లక్ష్యం: క్రౌన్ ప్రిన్స్
- January 08, 2016
డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ కమాండర్, క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, బహ్రెయిన్‌లోని అమెరికా రాయబారి విలియమ్ రోయ్‌బక్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో, ఇరు దేశాల మధ్య మరింత సన్నిహిత సంబంధాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే బహ్రెయిన్ కింగ్‌డమ్‌లో వివిధ దేశాలకు చెందినవారి భద్రత కోసం తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని క్రౌన్ ప్రిన్స్ చెప్పారు. బహ్రెయిన్, యూఎస్‌తో ఎంతోకాలంగా సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయనీ, ఇవి భవిష్యత్తులోనూ ఇంకా గొప్పగా కొనసాగుతాయని ఇరువురూ అభిప్రాయపడ్డారు. సంబంధాల బలోపేతానికి ఇరువురూ తమ తమ అభిప్రాయాల్ని, ఆలోచనల్ని పరస్పరం పంచుకున్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







