యూఏఈ విజిట్ వీసా కన్ఫ్యూజన్
- January 08, 2016
విజిట్ వీసా పునరుద్ధరణపై కన్ఫ్యూజన్, చాలామంది ప్రయాణీకులపై పడింది. ఉద్యోగార్ధులు సైతం ఈ విధానంతో ఆందోళన చెందుతున్నారు. విజిట్ వీసా ఉన్నవారు తమ వీసా స్టేటస్‌ని మార్చుకోవడానికి 570 దిర్హామ్‌లు చెల్లిస్తే సరిపోతుందనే నిబంధననపై గందరగోళం కొనసాగుతోంది. ఈ నిబంధన విషయంలో ఇంకా అధికారిక సమాచారం రాలేదని ట్రావెల్ ఏజెంట్స్ చెబుతుండడంతో, విజిట్ వీసా ఇబ్బందులు తీవ్రమయ్యాయి. ఈ గందరగోళం నడుమ ప్రయాణాల్ని రద్దు చేసుకోవడమే మంచిదని చాలామంది భావిస్తున్నారు. ఈ గందరగోళం కారణంగా ప్రయాణాల్లో 10 నుంచి 15 శాతం తగ్గుదల గడచిన వారంలో నమోదయినట్లు సమాచారమ్. అయితే, అబుదాబీ నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం సీనియర్ ట్రావెల్ కన్సల్టెంట్ బిలాల్ చౌదరి మాట్లాడుతూ, కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రయాణీకులను గందరగోళానికి గురిచేస్తున్నాయనీ, ఆ కన్ఫ్యూజన్ వల్ల ప్రయాణాల్లో తగ్గుదల కనిపించినా, క్రిష్ ఐలాండ్ సహా పaలు ప్రాంతాలకు బుక్ అయిన టిక్కెట్లలో ఎలాంటి క్యాన్సిలేషన్స్ లేవని చెప్పారు.
--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







