క్రికెటర్ మహమ్మద్ షమీకి అరెస్ట్ వారెంట్
- September 02, 2019
వెస్టిండీస్ తో ప్రస్తుతం ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ లో ఆడుతున్న టీమిండియా బౌలర్ షమీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గృహహింస కేసులో షమీకి అతని సోదరుడు హసీద్ అహ్మద్‌కు వెస్ట్ బెంగాల్‌లోని అలిపోర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. 15 రోజుల లోపు కోర్టుముందు లొంగిపోవాలంటూ ఆదేశించింది.
పలువురు అమ్మాయిలతో వివాహేతర సంబంధం పెట్టుకుని తన భర్త, అతడి కుటుంబ సభ్యులు తనని వేధిస్తున్నారంటూ షమీ భార్య హసీన్ జహాన్ కేసు పెట్టగా.. గతేడాది ఐపీఎల్‌కు ముందు ఈ వార్త హైలెట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద కోల్ కతా పోలీసులు షమీపై గృహహింస కేసు పెట్టి చార్జ్ షీట్ దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే షమీ ఇంటికి వెళ్లిన జహాన్..అత్తారింట్లో హంగామా చేసి, షమీ తల్లిదండ్రులతో గొడవ పడింది. కూతురితో కలిసి వచ్చిన హసీన్ తనను తాను ఒక గదిలో నిర్భంధించుకోగా.. షమీ తల్లిదండ్రులు ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. దాంతో అక్కడకు వచ్చిన పోలీసులు ఆమెను అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకుని వెళ్లి తర్వాత బెయిల్ పై విడిచిపెట్టారు. ఈ క్రమంలోనే ఆమె షీమీ, అతని కుటుంబంపై పెట్టిన కేసులో విచారణ జరిపిన కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







