ఢిల్లీలో కుప్పకూలిన బిల్డింగ్..
- September 03, 2019
ఢిల్లీ కే బ్లాక్ జేజే కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం అర్థరాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. గాయపడ్డ మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిధిలాల్లో చిక్కుకున్న రెండు మృతదేహాలను వెలికి తీశారు. గాయపడ్డ ముగ్గురిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో భవనం కూలడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏమైందో అని బయటకు వచ్చి చూసే సరికి నిర్మాణంలో ఉన్న భవనం పేకమేడలా కూలిపడింది. మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. నిర్మాణంలో నాణ్యతా లోపమే భవనం కూలడానికి కారణంగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







