భారత్ చేరిన అపాచీ ఏహెచ్-64 హెలికాప్టర్..
- September 03, 2019
అమెరికా యుద్ధ హెలికాప్టర్ అపాచీ ఏహెచ్-64 భారత వాయుసేన అమ్ములపొదిలో చేరాయి. అమెరికాకు చెందిన బోయింగ్ విమాన సంస్థ ఇవాళ అపాచీ యుద్ధ హెలికాప్టర్లను భారత్‌కు అందించింది. పంజాబ్‌లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ఈ అత్యాధునిక యుద్ధ విమానాలకు పూజలు చేసి ఘనంగా ప్రారంభించారు ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవా. వీటి చేరికతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరింత బలోపేతం కానుంది.
అత్యాధునిక యుద్ధ హెలికాప్టరైన అపాచీ అన్ని వాతావరణ పరిస్థితుల్లో పని చేస్తుంది. గగన తలమే కాదు.. నేలపై కూడా టార్గేట్లను చేధించగలదు. ఇప్పటికే ఈ హెలికాప్టర్‌కు సంబంధించి అన్ని రకాల ముందస్తు పరీక్షలు పూర్తి చేసినట్లు భారత వాయుసేన అధికారులు ప్రకటించారు. అపాచీ ఏహెచ్-64 తొలిసారిగా ఎఎఫ్‌ఎస్ హిండన్ ఎయిర్ బేస్‌లో తొలిసారిగా గాలిలోకి విజయవంతంగా ఎగిరాయి. మొత్తం 8 హెలికాప్టర్లు భారత వాయుసేనకు అందాయి.
2015 సెప్టెంబర్‌లో 22 అపాచీ హెలికాఫ్టర్ల కోసం అమెరికా ప్రభుత్వం, బోయింగ్‌తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్ట్‌పై సంతకం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ 8 హెలీకాప్టర్లు భారత్‌కు అందగా.. మిగిలిన14 చాపర్లు 2020 నాటికి భారత్‌కు చేరున్నాయి. అపాచీ హెలికాప్టర్ల నిర్వహణ కోసం ఇప్పటికే మన ఎయిర్ ఫోర్స్ టైనింగ్ కూడా తీసుకుంది. అలబామాలోని ఫోర్ట్ రూకర్ ఆర్మీ బేస్‌లో శిక్షణ జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







