ముకేశ్ అంబానీ ఇంట సంబరాలు..
- September 03, 2019
ప్రముఖ పారిశ్రామిక వేత్త.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట వినాయకచవితి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కూతురు, కొడుకు పెళ్లిళ్లు ఒకే సంవత్సరంలో జరగడంతో ఇరు జంటలకు ఇదే మొదటి వినాయకచవితి. దాంతో ఈ సంబరాలను అత్యంత ఆనందంగా జరుపుకోవాలని భావించారు అంబానీ దంపతులు. ఇందుకోసం వేడుకల్లో పాలు పంచుకునేందుకు రమ్మంటూ ఆహ్వాన పత్రికలను సైతం ప్రింట్ చేయించారు. పండుగకు వారం రోజుల ముందు నుంచే అంబానీ ఇంట హడావిడి మొదలైంది. అత్యంత సన్నిహితులందరికీ ఆహ్వాన పత్రికలు అందాయి. వారంతా గణేష్ ఉత్సవ సంబరాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇక ముంబైలో ఉన్న అంబానీ ఇల్లు ఆంటిలియా కళ్లు చెదిరే విద్యుత్ కాంతులతో మిరుమిట్లు గొలుపుతోంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆహ్వాన పత్రికలను చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







