కాబుల్:బాంబు దాడి.. 16మంది మృతి..
- September 03, 2019
కాబూల్ నగరంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గ్రీన్ విల్లే సమీపంలో బాంబుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 16మంది మరణించారు. 120 మంది గాయపడ్డారు. వీరిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనకు తామే బాధ్యులమని తాలిబన్లు ప్రకటించుకున్నారు. అమెరికా ప్రతినిధి అల్మయ్ ఖలీల్జాద్ తమ దళాలను ఉపసంహరించుకునే ప్రతిపాదనపై చర్చించేందుకు కాబూల్ వచ్చిన సందర్భంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు పదార్ధాలు నింపిన వాహనంతో ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికిచేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







