అమెరికా లో ముంచుకొస్తున్న మహా విపత్తు..
- September 03, 2019అమెరికాలో డొరియన్ హరికెన్ బీభత్సం సృష్టిస్తోంది. ఫ్లోరిడా సమీపంలోని బహమాస్ ద్వీపాన్ని అతలాకుతలం చేసింది. గంటకు 220 కిలోమీట్ల వేగంతో గాలులు వీయడంతో ఇళ్లు, చెట్లు నేలమట్టమయ్యాయి. తుపాన్ కారణంగా ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. మృతుల వివరాలను బహమాస్ ప్రధాని హుబర్ట్ మిన్నిస్ నిర్దారించారు.. దాదాపు 13వేల ఇళ్లు పూర్తిగా ద్వంసమయ్యాయని, వేలాది నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోస్టుగార్డు అధికారులు హెచ్చరికలు జారీచేశారు. డొరియన్ హరికెన్ మరికొన్ని గంటల్లో ప్లోరిడాను తాకనుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి సహాయక చర్యలకు సిద్దమయ్యారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక