అప్ఘనిస్థాన్ లోని అమెరికా సైనికులను తొలగింపు

- September 03, 2019 , by Maagulf
అప్ఘనిస్థాన్ లోని అమెరికా సైనికులను తొలగింపు

అప్ఘనిస్థాన్ లోని అమెరికా సైనికులను తొలగించనున్నట్లు యూఎస్ అధికారులు తెలిపారు. తాలిబన్ జరిగిన శాంతి చర్చల అనంతరం, ఒప్పందం ప్రకారం ఐదు బేస్ క్యాంప్ ల నుంచి 5వేలమంది సైనికులను 135 రోజుల్లో స్వదేశానికి పంపిస్తున్నట్లు అమెరికా ప్రతినిధి అల్మయ్ ఖలీల్జాద్ వెల్లడించారు. అఫ్ఘనిస్థాన్ లోని వేర్పాటువాద నాయకులతో కొన్ని నెలలుగా జరుగుతున్న శాంతి చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ ఒప్పందాలపై అమెరికా అధ్యక్షుడు, అఫ్గన్ ప్రధానమంత్రి సంతకాలు చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. అమెరికా, దాని మిత్రదేశాలపైతాలిబన్ దాడులను చేయకూడదనే ఒప్పందం ప్రకారం సైన్యాన్ని ఉపసంహరించుకున్నట్లు ఖలీల్జాద్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com