లక్నోలో యూఏఈ సంస్థ లులు ఇన్వెస్ట్‌మెంట్
- January 08, 2016
యూఏఈ సంస్థ లులు, భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోగల లక్నోలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. 150 మిలియన్ డాలర్లు (550 మిలియన్ దిర్హామ్‌లు, అంటే వెయ్యి కోట్లు)తో లక్నోలో ఓ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్ మరియు ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించనున్నట్లు 'లులు' గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ మా చెప్పారు. ఆగ్రామాలో యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో కలిసి ఈ విషయాన్ని ప్రకటించారు అలీ. యూపీలో తాము పెట్టబోడుతున్న పెట్టుబడుల ద్వారా 3000 కొత్త ఉద్యోగాల్ని సృష్టించనున్నట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ఉత్తరప్రదేశ్‌కి చెందిన 2000 మంది తమ సంస్థకు చెందిన ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాల్లో పనిచేస్తున్నారనీ చెప్పారాయన. పలు యూనివర్సిటీలనుంచి తనకు డాక్టరేట్ ఆఫర్లు వచ్చినా, అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ ఆఫర్‌ని మాత్రమే స్వీకరించాననీ, డాక్టరేట్ స్వీకరించిన తర్వాత, యూనివర్సిటీలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ అవసరాన్ని గుర్తించి, బాలికల కోసం 5, బాలుర కోసం 5 కోట్లు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం వెచ్చించానని అన్నారు. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, అలీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామనీ, ప్రభుత్వం తరఫున లులు సంస్థకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రసాసీ దివస్ కార్యక్రమంలో చెప్పారు.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







