భారత్ ను కుదిపేయనున్న ఆర్ధిక మాంద్యం..ఇప్పుడు అశోక్ లేల్యాండ్
- September 09, 2019
హైదరాబాద్: ఆర్థిక మాంద్యం వల్ల ఇప్పటికే మారుతీ సుజికీ సంస్థ కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో పెద్ద కంపెనీ అశోక్ లేల్యాండ్ కూడా ఇదే నిర్ణయాన్ని వెల్లడించింది. తన ఉత్పత్తులకు డిమాండ్ లేకపోవడంతో.. కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేయనున్నట్లు అశోక్ లేల్యాండ్ వెల్లడించింది. సెప్టెంబర్‌లో ప్రొడక్షన్ హాలీడేను ప్రకటిస్తున్నట్లు ఆ సంస్థ ఇవాళ పేర్కొన్నది. స్టాక్ మార్కెట్లకు కూడా ఈ విషయాన్ని చేరవేసింది. ఎన్నోర్ ప్లాంట్‌లో 16 రోజులు, హోసూర్ ప్లాంట్‌లో అయిదు రోజుల పాటు ఉత్పత్తి ఉండదని పేర్కొన్నది. ఇదే నెలలో పంత్‌నగర్ ప్లాంట్‌లో 18 రోజులు, అల్వార్, బందారా ప్లాంట్లలో పదేసి రోజులు ఉత్పత్తి ఉండదని సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







