ఓరెడూ మారథాన్‌లో పాల్గొన్న 2000 మంది
- January 08, 2016
కోర్నిచెలో జరిగిన ఓరెడూ మారథాన్‌లో 2000 మంది పాల్గొన్నారు. వివిధ వయసులకు చెందినవారు పాల్గొనడంతో మారథాన్ ఉల్లాసభరితంగా సాగింది. ఆరోగ్యం కోసం, అలాగే ఛారిటీ కోసం ఈ మారథాన్‌ని నిర్వహించారు. ఉదయం 6.30 నిమిషాలకు ప్రారంభమైన ఈ ఫుల్ మారథాన్ 42.195 కిలోమీటర్ల మేర సాగింది. హాఫ్ మారథాన్‌లో చాలా ఎక్కువమంది కన్పించారు. 10, 5, కిలోమీటర్ల జూనియర్ మరియు అడల్ట్ రేస్‌లలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న పిల్లల కోసం 3, 1 కిలోమీటర్ల మారథాన్ ఈవెంట్స్‌ని కూడా నిర్వహించారు. ఫుల్ మారథాన్‌లో కెన్యాకు చెందినవారు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. పురుషులు, స్త్రీల విభాఞగంలో వారికే విన్నింగ్ ఛాన్స్ దక్కింది. 2 గంటల 21 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకున్న అమోస్ మైంది తొలి స్థానం దక్కించుకున్నారు పురుషుల విభాగంలో. పమేలా చప్కోయెచ్ బుండోటిచ్ మహిళల విభాగంలో 2 గంటల 58 నిమిషాల్లో లక్ష్యం చేరి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







