గణేష్ నిమజ్జనం: మెట్రో ను ఉపయోగించండంటూ ప్రజలకు పిలుపు
- September 11, 2019
రోజూ ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని ఆఫీస్‌కి వెళ్లే సరికి దేవుళ్లంతా కనిపిస్తుంటారు. మరి గణేష్ నిమజ్జనం రోజు ట్రాఫిక్ మామూలుగా ఉండదుగా. ఇక ఆ రోజు రోడ్లన్నీ ఫుల్. బండి తీసి తొందరగా వెళ్దామనుకుంటే మాత్రం బుక్కయిపోతారు. అందుకే బండి ఇంట్లో పెట్టి మెట్రో ఎక్కమంటున్నారు హైదరాబాద్ పోలీసులు. ఆరోజు గణపతులన్నీ నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌కు తరలుతాయి కాబట్టి.. ఆవైపుగా వెళ్లే మార్గాల్లో ఇతర వాహనాలను అనుమతించరు. భారీ వాహనాలను నగర శివార్లలోనే ఆపేస్తారు. ఆర్టీసి బస్సులకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. నిమజ్జనోత్సవాన్ని వీక్షించడానికి వచ్చే ప్రజల కోసం ట్యాంక్‌బండ్‌పై అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ అనిల్ కుమార్ తెలిపారు. ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బస్టాండ్, పంజాగుట్ట మార్గాల నుంచి వచ్చేవారు నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ మార్గం గుండా కాకుండా, వేరే మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. నిమజ్జనోత్సవంలో ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక కంట్రోల్ రూం, హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. సహాయం కావాలనుకునేవారు 040-27852482,9490598985 నెంబర్లలో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







