నార్త్ అమెరికాలో ఏ.పి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రత్నాకర్
- September 11, 2019
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తరపున అమెరికాలో ప్రత్యేక ప్రతినిధిగా కడప జిల్లా రాజంపేటకు చెందిన పండుగాయల రత్నాకర్‌ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రత్నాకర్ మాట్లాడుతూ 'నాకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తాను. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను' అని అన్నారు. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం రత్నాకర్ వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..