భారత్ దేశంలో మరో ఎన్నికల సమరం!
- September 11, 2019
భారత్ దేశంలో మరో ఎన్నికల సమరానికి తెరలేవనుంది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు అక్టోబర్-డిసెంబర్ మధ్య ఎలక్షన్లు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ రానుంది. ఈ వారం చివరి నాటికి ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముంది. ఇందుకు సంబంధించి సీఈసీ కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ముందుగా మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రక్రియ ముగిసిన తర్వాత జార్ఖండ్‌లో పోలింగ్ చేపట్టనున్నారు.
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు 2014 అక్టోబర్‌లో ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 15న పోలింగ్ నిర్వహించి 19న ఫలితాలు ప్రకటించారు. జార్ఖండ్ అసెంబ్లీకి కూడా 2014 డిసెంబర్‌లో 5 దశల్లో పోలింగ్ జరిగింది. ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ ఉంటుందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి.
హర్యానా, మహారాష్ట్రలకు దీపావళి కంటే ముందే పోలింగ్ పూర్తి చేస్తారని సమాచారం. జార్ఖండ్‌లో మాత్రం నవంబర్-డిసెంబర్ మధ్య ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. జార్ఖండ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈసీ భావిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







