స్కూళ్ళకి ఫ్రీ డ్రింకింగ్‌ వాటర్‌: ఆదేశించిన షార్జా రూలర్‌

స్కూళ్ళకి ఫ్రీ డ్రింకింగ్‌ వాటర్‌: ఆదేశించిన షార్జా రూలర్‌

యూఏఈ: షార్జా రూలర్‌, సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌ డాక్టర్‌ షేక్‌ సుల్తాన్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ కాసిమి, స్కూళ్ళకు బాటిల్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ని ఉచితంగా సరఫరా చేయాలని షార్జా ఎలక్ట్రిసిటీ మరియు వాటర్‌ అథారిటీ (సెవా)కి ఆదేశాలు జారీ చేశారు. ఎమిరేట్‌లో మొత్తం 116 స్కూళ్ళు వున్నాయి. ఇందులో 200,000 మంది విద్యార్థులున్నారు. 135 మంది నర్సరీల్లో 6,500 మంది విద్యార్థులున్నారు. వీరందరికీ ఉచితంగా బాటిల్డ్‌ వాటర్‌ అందివ్వాలని షార్జా రూలర్‌ ఆదేశించడం జరిగింది. కాగా, సెవా ఛైర్మన్‌ డాక్టర్‌ రషీద్‌అల్‌ లీమ్‌ మాట్లాడతూ, రూలర్‌ నిర్ణయాన్ని స్వాగతించారు. కొత్త స్కూల్‌ ఇయర్‌ ప్రారంభం నుంచే ఈ ఉచిత నీటి పంపకం ఏర్పాట్లు చేపడతామని ఆయన తెలిపారు.

 

Back to Top