కుల్‌భూషణ్ జాదవ్ విషయంలో పాక్ కాఠిన్యం

- September 12, 2019 , by Maagulf
కుల్‌భూషణ్ జాదవ్ విషయంలో పాక్ కాఠిన్యం

న్యూఢిల్లీ: భారత నావికా దళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ విషయంలో పాకిస్తాన్ తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశమైంది. రెండోసారి కుల్‌భూషణ్‌ను కలిసేందుకు భారత దౌత్య కార్యాలయ అధికారులకు అవకాశం ఇవ్వబోమని పాక్ తేల్చి చెప్పింది. ఈ మేరకు పాక్ విదేశాంగ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 2న కుల్‌భూషణ్‌ను కలిసేందుకు అనుమతి లభించిన విషయం విదితమే. పాక్ జైలులో ఉన్న జాదవ్‌తో భారత డిప్యూటీ హై కమిషనర్ గౌరవ్ అహ్లువాలియా సెప్టెంబర్ 2న గంట పాటు భేటీ అయ్యారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై చర్చించారు. గూఢచర్యం ఆరోపణలతో కుల్‌భూషణ్‌కు పాక్ మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2016, మార్చి 3న జాదవ్‌ను బలూచిస్తాన్‌లో పాక్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. కుల్‌భూషణ్‌ను కాపాడేందుకు భారత్ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కుల్‌భూషణ్‌ను కలిసేందుకు మరోమారు అనుమతి ఇవ్వబోమంటూ పాక్ చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com