భర్త ప్రైవేట్ పార్ట్‌ని కత్తిరించినందుకు నార్త్ కరోలినా మహిళ అరెస్ట్
- September 12, 2019
అమెరికా:అన్నోన్య దంపతులు.. సజావుగా సాగుతున్న వారి జీవనప్రయాణంలో.. అనుకోని కుదుపులు వచ్చి వారి జీవితాన్నే నాశనం చేసింది. ఇన్నాళ్లు మంచిగా ఉన్న భర్త తీరులో మార్పును గమనించింది భార్య. ఆ మార్పుని చూసి తట్టుకోలేకపోయింది. దీంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్తపై తీవ్ర కోపంతో రగిలిపోయిన భార్య సహనం కోల్పోయింది. వృద్ధుడని కూడా చూడకుండా ఎవరూ చేయని విధంగా అత్యంత దారుణానికి ఒడి గట్టింది. అమెరికాలోని నార్త్ కరోలినాలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
న్యూపోర్ట్‌లో జేమ్స్ ఫ్రాబట్(61) అనే వ్యక్తి భార్య విక్టోరియాతో కలిసి ఉంటున్నాడు. ఇదిలాఉండగా దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. సోమవారం కూడా ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో కోపంతో రగిలిపోయిన విక్టోరియా భర్తను తాళ్లతో బంధించి చిత్రహింసలకు గురి చేసింది. కత్తితో అతడి ప్రైవేట్ పార్ట్‌ని కోసేసింది. బాధను భరించలేక భర్త విలవిల్లాడిపోతుంటే.. భార్య పైశాచికానందం పొందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న జేమ్స్‌ని హాస్పటల్‌కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విక్టోరియాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం జేమ్స్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







