'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
- September 12, 2019
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. రాయలసీమ ప్రాంతానికి చెందిన తొలి తరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ చరణ్, తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థపై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, ఈ భారీ సినిమాకు అమిత్ త్రివేది సంగీతాన్ని, రత్నవేలు ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. పాన్ ఇండియా ఫీల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ కు మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ లభించిన విషయం తెలిసిందే.
అతి త్వరలో యూట్యూబ్ ద్వారా ఒక్కొక్క పాటను రిలీజ్ చేయనున్న సినిమా యూనిట్, ఈనెల 18వ తేదీన హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనుంది. ఈ వేడుకకు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శక ధీరుడు రాజమౌళి, మాస్ డైరెక్టర్ వివి వినాయక్ తదితరులు విశిష్ట అతిథులుగా హాజరు కానున్నారు. ఇక ఈ వేడుకకు సంబంధించి అప్పుడే భారీ స్థాయిలో ఏర్పాట్లు మొదలయ్యాయని, కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఈవెంట్ ని నిర్వహించాలని సంకల్పించారట నిర్మాత రామ్ చరణ్.
ఇక ఈ సినిమాలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్ తో పాటు మోహన్ లాల్ కూడా ఈ వేడుకకు హాజరు కానున్నట్లు సమాచారం అందుతోంది. కాగా ఈ వార్త కాసేపటి క్రితం బయటకు రాగానే, మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అదీకాక ఈ వేడుకకు వస్తున్న అతిథుల్లో పవర్ స్టార్ కూడా ఉండడంతో వారు మరింత సంబర పడిపోతున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సైరా సినిమా, ప్రస్తుతం డబ్బింగ్ తదితర నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







