సుమ ఇంకా ఎన్ని రికార్డులు స్థాపించనుందో..
- January 09, 2016
తెలుగు బుల్లి తెరపై ఈ టీవి వారు ఎన్నో ప్రోగ్రామ్స్ ఆవిష్కరించారు. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని రకాల కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. అయితే ఈ మద్య కాలంలో ఈటీవి రెండు ప్రోగ్రామ్స్ మాత్రం ప్రజల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. అవే జబర్ధస్త్ కామెడీషో, స్టార్ మహిళ. జబర్దస్త్ ప్రోగ్రామ్ తో అనసూయ, రేష్మీ లాంటి యాంకర్లకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. దీంతో వారు వెండి తెరపై అలరించ బోతున్నారు. ఇక స్టార్ మహిళతో సుమ ఎక్కడ లేని క్రేజ్ వచ్చిపడింది. ఇక ఈటీవీలో ప్రసారం అవుతున్న స్టార్ మహిళ పోగ్రాం ఏకంగా 2000 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. బుల్లితెర చరిత్రలోనే ఇదొక రికార్డుగా నిలిచిపోయింది.ఈ ప్రోగ్రామ్ లో ఎంతోమంది మహిళలు పాల్గొన్నారు...అంతగా ఆదరణ పొందిన ఈ ప్రోగ్రామ్ ఓ కొత్త లుక్, కిక్కు వచ్చిందనేది వాస్తవం అనడానికి కారణంగా 2000 ఎపిసోడ్స్ పూర్తిచేసుకోవడామే. అంతే కాదు ఈ ప్రోగ్రామ్ మధ్యాహ్నం రాడంతో ప్రశాంతంగా మహిళలను పని పూర్తి చేసుకొని టీవీలకు అతుక్కు పోయే వారు. ఈ పోగ్రాంలో సాధారణ మహిళల్ని తీసుకొచ్చి వాళ్లతో గేమ్ షో నడపడం కూడా బాగా క్లిక్కయింది. ఫన్నీగా ఉండే గేమ్స్, అతివల అందాలు, వాళ్ల దుస్తులు షోకు మరింత ఆకర్షణగా నిలిచాయి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే స్టార్ మహిళ కార్యక్రమం పైవ్ స్టార్ రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈ ప్రోగ్రామ్ లో యాంకర్ గా వ్యవహరిస్తున్న సుమ ఇంకా ఎన్ని రికార్డులు స్థాపించనుందో..
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







