తెలంగాణలో మళ్లీ టీడీపీని పునర్ నిర్మిస్తా:చంద్రబాబు
- September 14, 2019
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పునర్ నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని అధినేత మన చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన ముఖ్యనేతలు, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తెలంగాణలో నూతన నాయకత్వం టీడీపీకి అవసరం ఉందన్నారు. నాయకత్వ లోపాన్ని సరిదిద్దుకుందామన్నారు. 119 నియోజకర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పుట్టింది హైదరాబాద్‌లోనేనని గుర్తుచేశారు. నాయకులు పోతుంటారు.. కానీ కార్యకర్తలే టీడీపీకి బలమని చెప్పుకొచ్చారు. దాదాపు 9 నెలల తర్వాత చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఆయనపై పూలవర్షం కురిపించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







