డిక్టేటర్ రీమేక్‌లో అజిత్..
- January 09, 2016
బాలకృష్ణ, అంజలి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన డిక్టేటర్ చిత్రం సంక్రాంతి బరిలో నిలుస్తోండగా, ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తోంది. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించగా ఆడియో కూడా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ చిత్రంపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రాన్ని కోలివుడ్ , బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.డిక్టేటర్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుండగా ఈ చిత్రాన్ని తమిళంలో అజిత్‌తో చేయించాలని ఈరోస్ సంస్ధ భావిస్తోంది. వేదాలం చిత్ర సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్న అజిత్ కూడా రీమేక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.అయితే తెలుగులో విడుదలైన తర్వాత ఆ చిత్ర ఫలితాన్ని చూసి తాను రీమేక్ చేయాలా వద్దా అనేది డిసైడ్ అవనున్నట్టు తెలుస్తోంది
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







