స్ప్రింక్లర్ వ్యవస్థను వైఫై ఇంటర్నెట్తో
- January 09, 2016
ఒక్క రోజు నీరు రాకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం. నీటి వృథాతో వచ్చే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. భవిష్యత్తు బాగుండాలంటే నీటిని ఆదా చేయాల్సిందే. దీన్ని గమనించిన అమెరికాలోని డెన్వర్‌కు చెందిన రషియో సంస్థ వైఫైతో నడిచే స్మార్ట్ స్ప్రింక్లర్ల వ్యవస్థను రూపొందించింది. ఇవి 30 శాతం నీటిని ఆదా చేయడం విశేషం. స్మార్ట్‌ఫోన్ సాయంతో ఈ వ్యవస్థను నియంత్రించవచ్చు. స్ప్రింక్లర్ వ్యవస్థను వైఫై ఇంటర్నెట్తో అనుసంధానిస్తారు. నియంత్రణకు సంబంధించిన యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేస్తారు. దీంతో ఇంటి వద్దనుంచే వీటిని నియంత్రణ సాధ్యమవుతుంది. దీని సాయంతో సీజన్ల వారీగా నీటిని విడుదల చేయవచ్చు. వాతావరణాన్ని పరిశీలించి వర్షం వస్తే దానంతట అదే ఆగిపోతుంది. భూమిలో నీరు ఇంకిన శాతం గమనిస్తుంది. ఆవిరి కాగానే మళ్లీ నీటిని విడుదల చేస్తుంది. 2012లో అమెరికాలోని కొలరాడోలో వచ్చిన కరవును చూసి చలించిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు క్రిస్ క్లెయిన్, ఫ్రాన్జ్ గార్సోంబ్కేలు ఈ వ్యవస్థను రూపొందించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







