ఆమిర్ ఖాన్ తో నటించనున్న యోగిబాబు
- September 15, 2019
కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగి బాబు ఓ బాలీవుడ్ చిత్రంలో నటించ నున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన నటించనున్న మొదటి చిత్రం అది కూడా బాలీవుడ్ స్టార్హీరో ఆమీర్‌ఖాన్ చిత్రం కావడం విశేషం. అమీర్‌ఖాన్ నటించనున్న ఓ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్‌సేతుపతి నటించనున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని ఆమీర్‌ఖాన్ కూడా తెలిపారు. ప్రస్తుతం ఆ చిత్ర ప్రారంభ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో హస్యనటుడు యోగిబాబు కూడా ఈ చిత్రంలో నటించనున్నట్టు సమాచారం. ఇటీవల యోగిబాబు కూడా ఈ విషయంపై స్పందించి ప్రస్తుతం ఆమీర్‌ఖాన్ నటించనున్న చిత్రంలో నటించేందుకుగాను చర్చలు జరుగుతున్నాయని, అందుకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుందని తెలిపారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి తమిళుడి పాత్రలోనే నటిస్తుండడంతో ఆయన స్నేహితుడి పాత్రలో యోగిబాబు నటించనున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







