కేటీఆర్ సీఎం అవుతాడంటూ వస్తోన్న ఊహాగానాలకు బ్రేక్
- September 16, 2019
హైదరాబాద్:కేటీఆర్ సీఎం అవుతాడంటూ వస్తోన్న ఊహాగానాలకు అసెంబ్లీ సాక్షిగా తెరదించారు. సీఎం కేసీఆర్. వచ్చే పదిహేనేళ్ల వరకు తానే సీఎం అంటూ తేల్చి చెప్పేశారు. తన ఆరోగ్యంపైనా క్లారిటీ ఇచ్చారాయన. 20 ఏళ్లుగా తనను రోజు చంపుతూనే ఉన్నారని సెటైర్లు పేల్చారు. తెలంగాణ రాజకీయాల్లో కొన్నేళ్లుగా వినిపిస్తున్న ప్రచారానికి.. టీఆర్ఎస్ లో ఎదో జరుగుతోందన్న పుకార్లకు సమాధానంగా కేసీఆర్ వదిలిన అస్త్రాలవి. నిజానికి కేసీఆర్ ఆరోగ్యంపైనా, ప్రభుత్వ పగ్గాల మార్పిడిపైనా ఎవేవో పుకార్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు ప్రక్రియ తర్వాత కేటీఆర్ కు పగ్గాలు అప్పగించబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
కేటీఆర్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను చేశాక ఆ ప్రచారం మరింత జోరందుకుంది. వారసుడిని సీఎం కుర్చీకి మరింత చేరువ చేసేందుకు ముందస్తు ప్రయత్నాలుగా చెప్పుకున్నారు. కానీ, అనూహ్యంగా అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఆ ప్రచారాలన్నింటిని పటాపంచలు చేస్తూ మరో పదేళ్ల వరకు నేనే సీఎంగా ఉంటానని క్లారిటీ ఇచ్చారు. తన ఆరోగ్యంపై వినిపిస్తున్న ప్రచారంపైనా స్పష్టత ఇచ్చారు.
కొద్దిరోజులుగా టీఆర్ఎస్ స్టీరింగ్ అదుపు తప్పినట్లు ప్రచారం నడుస్తోంది. గులాబీ బాస్ చెబితే ఎస్ బాస్ అనే వారి స్వరంలో అనూహ్య మార్పులు రావడమే ఇందుకు కారణమని కొందరంటున్నారు. అటు చాపకింద నీరులా గులాబీని కబలించే వ్యూహంతో బీజేపీ దూసుకొస్తోంది. ఈ సమయంలో కేసీఆర్ నాయకత్వ మార్పిడిపై స్పష్టమైన ప్రకటనతో పార్టీలో ధిక్కార స్వరాలను చల్లబరిచే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.అటు ప్రతిపక్షాలు కేసీఆర్ ప్రకటన వెనక మరో మర్మం ఉందని అంటున్నాయి. బడ్జెట్ పై సమాధానం చెప్పాల్సిన సమయంలో అసందర్భంగా తన రాజకీయ భవిష్యత్తు గురించి చెప్పడాన్ని తప్పుపట్టారు కాంగ్రెస్ నేత విజయశాంతి. అయితే..కేటీఆర్ ను సీఎం చేయబోవటం లేదనే ప్రకటన పార్టీలో ఓ వర్గాన్ని సంతృప్తిపర్చటానికే అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు