కోడెల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు
- September 16, 2019
గుంటూరు : ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి వార్త విన్న టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు, మాజీ మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల మృతి పట్ల వారు సంతాపం ప్రకటిస్తూ.. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, మద్దాలిగిరి, నేతలు యరపతినేని, దూళిపాళ్ల నరేంద్ర తదితరులు కోడెల మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కోడెల శివప్రసాదరావు (72) సోమవారం మధ్యాహ్నం తన ఇంట్లో ఉరేసుకున్నారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన బసవతారకం ఆస్సత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా.. గత కొన్ని రోజులుగా కోడెలపై కేసులు చుట్టుముట్టడంతో.. రాజకీయ వేధింపులు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కోడెల ఇకలేరన్న విషయం తెలుసుకున్న వీరాభిమానులు, టీడీపీ కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







