దసరా ను టార్గెట్ చేస్తున్నట్లు ప్రకటించిన ఉగ్రసంస్థ జైషే మహ్మద్
- September 16, 2019
దసరా ఉత్సవాల వేళ నరమేధం సృష్టించేందుకు సిద్ధమైనట్లు ఉగ్రసంస్థ జైషే మహ్మద్ ప్రకటన విడుదల చేసింది. మసూద్ అహ్మద్ అనే పేరిట రాసిన లేఖలో దసరా సందర్భంగా ఆరు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని పదకొండు పట్టణాల్లో పేలుళ్లకు పాల్పడనున్నట్లు పేర్కొంది. సదరు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లతో పాటు జన సమ్మర్థంతో ఉండే ఆలయాల్లో కూడా బాంబు దాడులకు తెగబడతామని తెలిపింది.
అక్టోబర్ 8న హర్యానాలోని రోహతక్ రైల్వే స్టేషనుతో పాటు... ముంబై సిటీ, బెంగళూరు, చెన్నై, జైపూర్, భోపాల్, కోటా, ఇటార్సీ రైల్వే స్టేషన్లను పేల్చివేస్తామని జైషే లేఖలో పేర్కొంది. అదే విధంగా రాజస్తాన్, జైపూర్, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలోని పలు ఆలయాల్లో కూడా పేలుళ్లకు పాల్పడతామని పేర్కొంది. తమవారిని సైనికులు ఎన్ కౌంటర్ చేస్తున్నారని, అందుకు ప్రతీకారంగానే పలు రైల్వే స్టేషన్లపై దాడులకు పాల్పడనున్నామని హెచ్చరించింది.
ఇక ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ లేఖ రోహతక్ రైల్వే జంక్షన్ సూపరిండెంటెండ్ కార్యాలయానికి శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పోస్టు ద్వారా వచ్చింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్‌లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్‌గ్రౌండ్‌లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం