తడిసి ముద్దయిన బెజవాడ

- September 17, 2019 , by Maagulf
తడిసి ముద్దయిన బెజవాడ

విజయవాడ:అరగంట పాటు ఆగకుండా కురిసిన వర్షానికి విజయవాడ తడిసి ముద్దయింది .ప్రధాన రహదారులు జలమయమయ్యాయి .చిన్నపాటి చెరువులను తలపించాయి. కొద్దిపాటి వర్షానికే నగరంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రహదారులు జలమయం కాగా, ప్రధాన కూడళ్లు చెరువులను తలపించాయి. డ్రైనేజీ వాటర్‌తో కలిసి వర్షపు నీరు రోడ్లపైకి వచ్చేయటంతో వాహన చోదకులు ,పాదచారులు నానా అవస్థలు పడ్డారు. సైలెన్సర్లు నీట మునగటంతో ద్విచక్ర వాహనాలు ముందుకు కదిలేందుకు మొరాయించాయి. ఇక డ్రైనేజ్‌ నీళ్లు, వర్షం నీటితో కలిపి రోడ్లపైకి వచ్చేయడంతో దుర్గంధం వెలువడుతోంది. దీంతో పాదచారులు ఇబ్బం‍దులు పడ్డారు.
కృష్ణా, గుంటూరులో భారీ వర్షం : ఇక కృష్ణాజిల్లా  గన్నవరం, నందిగామలో భారీ  వర్షం పడింది. రోడ్లన్నీ జలమయం కావడంతో డ్రైనేజ్‌లు పొంగి పొర్లుతున్నాయి. వర్షపు నీటితో పల్లపు ప్రాంతాలో చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. అలాగే గుంటూరు జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. రహదారులు అన్ని జలమయం అయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com