కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ లో కోటి రూపాయలు గెలుచుకున్న తెలుగు అమ్మాయి

- September 17, 2019 , by Maagulf
కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ లో కోటి రూపాయలు గెలుచుకున్న తెలుగు అమ్మాయి

ముంబై:అమరావతికి చెందిన బబిత తాడే కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ లో కోటి రూపాయలు గెలుచుకుంది.నెలకు 1500 జీతం వచ్చే వ్యక్తికీ అసలు ఉన్నా ఆ ఆశలు నిలబెట్టుకోవడానికి వచ్చే డబ్బులు సరిపోవు. ఈరోజుల్లో నెలకు 50వేలు 60వేలు సంపాదించే వ్యక్తులు కూడా నెల మధ్యకు వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉండటం లేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందుల కారణంగా అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులు తీర్చేందుకు మరో అప్పు ఇలా జీవితం ఆంతా దాని చుట్టూనే తిరుగుతున్నది తప్పించి.. మరో పని చేయడానికి సమయం దొరకడం లేదు.

పైగా ఏదైనా చేద్దామని అనుకున్నా తీసుకున్న అప్పులు గుర్తుకు వస్తాయి. లక్ష్యం పక్కన పడిపోతుంది. అలా కాకుండా, వాటిని పెద్దగా పట్టించుకోకుండా లక్ష్యం వైపుకు అడుగులు వేస్తె.. తప్పకుండా మార్గం దొరుకుంటుంది విజయం సాధించడానికి దారులు కనిపిస్తాయి. ఇలాంటి దారి మహారాష్ట్రకు చెందిన బబిత అనే మహిళకు కనిపించింది. ఆమె ఓ పాఠశాలలో వంటమనిషిగా పనిచేస్తున్నది. రోజుకు 450 మంది పిల్లలకు వండి పెట్టాలి. నెలకు కేవలం రూ. 1500 రూపాయల జీతం. ఏ మూలకు సరిపోతుంది.

అలా చాలీచాలని జీతం.. ఉదయం నుంచి బండెడు చాకిరి. అయినా ఆమె తగ్గలేదు. అడుగు వెనక్కి వేయలేదు. ఖచ్చితంగా విజయం సాధించాలని అనుకుంది. దానికి కోసం దారులు వెతికింది. ఆ సమయంలోనే కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ కనిపించింది. ఆ ప్రోగ్రాం లో పాల్గొనడానికి మార్గాలు అన్వేషించింది. చివరకు అవకాశం అందిపుచ్చుకుంది. 2000లో ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు 10 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 11 వ సీజన్.

ఈ సీజన్ లో బబిత తాడేకు ఛాన్స్ వచ్చింది. ఎదురుగ గాంభీర్యంగా ఉండే అమితాబ్. కష్టమైనా ప్రశ్నలు. ఆన్సర్ ఖచ్చితంగా చెప్పాలి. లేదంటే వెనక్కి వెళ్లిపోవాల్సి వస్తుంది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. అమితాబ్ ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆమెలో ఎలాంటి టెన్షన్ లేకుండా ఆన్సర్ చెప్తున్నది. ఒక్కో ప్రశ్నకు సరైన జవాబు చెప్తూ ముందుకు వెళ్తున్నది. చివరి ప్రశ్న.. దానికి సరైన సమాధానం చెప్తే.. కోటి రూపాయలు గెలుచుకోవచ్చు.. అమితాబ్ ప్రశ్న అడిగారు.హాడావుడిగా సమాధానం చెప్పకుండా నిదానంగా ఆలోచింది సమాధానం చెప్పింది.అమితాబ్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ.. రైట్ ఆన్సర్.. కరోడ్ గెలుచుకున్నారు అని చెప్పడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.ఇప్పటి వరకు తనకు ఫోన్ లేదని మంచి ఫోన్ కొనుక్కుంటా అని చెప్పింది బబిత తాడే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com