జగన్మాత దుర్గమ్మకు లక్ష్మీ కాసుల హారం సమర్పించిన ఎమ్మెల్యే
- September 18, 2019
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్లను గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్‌రావు బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం నంబూరు శంకర్‌రావు దంపతులు అమ్మవారికి అలంకరణ నిమిత్తం తయారు చేయించిన 135 గ్రాముల బరువు గల బంగారు లక్ష్మి కాసుల హారాన్ని దేవస్థానం ఈవో ఎం.వి.సురేష్‌బాబుకు అందజేశారు. అమ్మవారికి బహుకరించిన హారంలో రాళ్ళ సూత్రాలు బంగారు తీగతో చుట్టబడి ఉన్నాయని, అందులో 62 లక్ష్మి కాసులు, 142 తెలుపు రాళ్ళు, 2 ఎరుపు రాళ్ళు మరియు నాన్‌కోడ్ ఉన్నాయని దాతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్‌రావు కుటుంబ సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం గావించి అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







