ఇండియా లో ఈ-సిగరెట్లపై కేంద్రం నిషేధం..
- September 18, 2019
ఇండియా:ఈ-సిగరెట్లపై కేంద్రం నిషేధం విధించింది. ఈ-సిగరెట్ల దిగుమతి, ఎగుమతి, విక్రయాలు, ప్రచారం వంటి అంశాలపై నిషేధం విధించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. యువతపై ఈ సిగరెట్ల ప్రభావం అధికంగా ఉందని.. అవి వారిపై తీవ్రమైన చెడు ప్రభావాన్ని చూపుతున్నాయని తెలిపారు. అమెరికా అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు నిర్మలా సీతారామన్.
పొగాకు బారిన పడి అనారోగ్యాలకు గురవుతున్నవారి సంఖ్యను తగ్గించాలనేది ప్రభుత్వం లక్ష్యం అన్నారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదించగా.. కేబినెట్ ఆమోదించింది. పొగ తాగే అలవాటు తగ్గించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా యువత ఈ-సిగరెట‍్లను ఆశ్రయిస్తున్నారు. భారతీయ యువతలో ఇదొక వ్యసనంగా మారకుండా జాగ్రత్తలు తీసుకొనేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







