అక్టోబర్‌ 18 నుంచి దుబాయ్‌ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌

అక్టోబర్‌ 18 నుంచి దుబాయ్‌ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌

దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌, దుబాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ షేక్‌ హమదాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ ప్రారంభించిన దుబాయ్‌ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ కొత్త ఎడిషన్‌ అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 16 వరకు జరగనుంది. 30 రోజుల ఈ ఎడిషన్‌లో పలు రకాలైన ఈవెంట్స్‌ నిర్వహిస్తారు. స్పోర్ట్స్‌, హెల్త్‌ మరియు వెల్‌నెస్‌ ప్రోగ్రామ్స్‌ ఇంకా చాలా ఆసక్తికరమైన అంశాలకు చోటు కల్పిస్తున్నారు. దుబాయ్‌ రెసిడెంట్స్‌, అలాగే విజిటర్స్‌ ఈ సీజన్‌ని ఎంజాయ్‌ చేయడానికి సంసిద్ధంగా వున్నారు. 2018 లో జరిగిన ఈవెంట్‌కి అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 34 శాతం ఎక్కువ మద్దతు లభించింది ప్రజల నుంచి. ఈ సారి ఇంకా ఎక్కువగా ఆశిస్తున్నారు నిర్వాహకులు.  

 

Back to Top