భారత్ ఊచకోతకు దిగవచ్చు... పాక్ పౌరులను హెచ్చరించిన ఇమ్రాన్
- September 19, 2019
పాకిస్థాన్ దేశపౌరులకు ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్ర హెచ్చరికలు చేశారు. భారత్ ఊచకోతకు దిగే అవకాశం ఉందని, అందువల్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన హితవు పలికారు. కాశ్మీర్ జిహాదీ కోసం ఎవరైనా వెళ్తే.. వాళ్లు (భారత్) ఆ ప్రాంతాన్ని మరింత జఠిలం చేసినవారవుతారన్నారు.
ఇటీవల కాశ్మీర్‌లో భారత ప్రభుత్వం అధికరణ 370ని రద్దు చేసింది. దీంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. దీనిపై ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ, పాకిస్థానీలు జిహాదీ కోసం కాశ్మీర్ దిశగా వెళ్తే.. ఆ సాకు చూసుకుని భారత్ ఆ ప్రాంతంలో తీవ్ర ఊచకోతకు దిగే అవకాశాలు ఉన్నట్లు ఇమ్రాన్ హెచ్చరించారు.
తమ దేశం కాశ్మీరీల వెంట ఉన్నట్లు ఆయన చెప్పారు. పాక్ నుంచి ఎవరైనా ఫైట్ చేసేందుకు భారత్‌కు వెళ్తే.. అప్పుడు కాశ్మీరీలకు అన్యాయం చేసిన మొదటి వ్యక్తి వారే అవుతారన్నారు. వాళ్లే కాశ్మీరీలకు శత్రువులవుతారని ఇమ్రాన్ తమ దేశ జిహాదీలను హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న తోర్కమ్ అనే ప్రాంతంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ హెచ్చరికలు చేశారు. చిన్న పొరపాటు చేసినా.. అప్పుడు భారత బలగాలు చిత్రహింసకు దిగుతాయని హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







