ఉత్తమ నటిగా అలియా, ఉత్తమ నటుడిగా రణ్‌వీర్
- September 19, 2019
ముంబయి: గత రాత్రి ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ) అవార్డ్స్ ఘనంగా జరిగాయి. బాలీవుడ్ ప్రముఖ తారలంతా ఈ వేడుకకి హాజరు కాగా, కార్యక్రమం సందడిగా జరిగింది. రాజీ చిత్రానికి గాను అలియా భట్ ఉత్తమ నటి అవార్డు అందుకోగా, పద్మావత్‌లో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రని అద్భుతంగా పోషించిన రణ్‌వీర్ సింగ్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా రాజీ ఎంపికైంది. ఉత్తమ డైరెక్టర్‌గా శ్రీ రామ్ రాఘవన్ అవార్డు అందుకున్నారు. విక్కీ కౌశల్, అదితిరావు హైదరి బెస్ట్ సపోర్టింగ్ రోల్‌కి గాను అవార్డు తీసుకున్నారు.ఐఫా అవార్డుల వేడుక కార్యక్రమం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దీపికా పదుకొణేకి స్పెషల్ అవార్డ్ ఇచ్చారు. బర్ఫీ చిత్రానికి గాను రణబీర్ కపూర్ స్పెషల్ అవార్డ్ అందుకున్నారు. ఇక స్పెషల్ అవార్డ్ కేటగిరీలో ఉత్తమ దర్శకుడు అవార్డు రాజ్ కుమార్ హిరాణీకి దక్కింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..